భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కార్తీక పౌర్ణమి సందర్భంగా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 59 మంది జంటలు ఈ సామూహిక వ్రతంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించారు. ఆలయ అర్చకులు ఆరుట్ల శ్రీకాంతాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి కథలు, ఉపమానాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో వ్రత కార్యక్రమం సాగింది.

వ్రత కార్యక్రమం అనంతరం 239 మంది భక్తులకు భోజన ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పూర్వపు గవర్నర్, ఆలయ…