భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

సీసీపల్లిలో ఘనంగా కోటి దీపోత్సవం

సీసీపల్లిలో ఘనంగా కోటి దీపోత్సవం

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: కార్తీక పౌర్ణమి సందర్భంగా కోహెడ మండలం సీసీపల్లి గ్రామంలోని శ్రీరాముల వారి ఆలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సర్పంచ్ సంపత్‌రావు, వనిత సంపత్‌రావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో ఎల్లబోయిన రమేష్‌తో పాటు గ్రామ మహిళలు, పలువురు భక్తులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో దీపాలు వెలిగించి పూజలు చేయడంతో ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో నిండిపోయింది. భక్తుల దీపారాధనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శ్రీరాముల వారి ఆలయం భక్తి శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి వేళ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.