భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: కార్తీక పౌర్ణమి సందర్భంగా కోహెడ మండలం సీసీపల్లి గ్రామంలోని శ్రీరాముల వారి ఆలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సర్పంచ్ సంపత్‌రావు, వనిత సంపత్‌రావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో ఎల్లబోయిన రమేష్‌తో పాటు గ్రామ మహిళలు, పలువురు భక్తులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో దీపాలు వెలిగించి పూజలు చేయడంతో ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో నిండిపోయింది.…