భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఆరేపల్లిలో ముగ్గురికి సీఎం రిలీఫ్ చెక్కులు నిరుపేదలకు వరం

భారత్ సమాచార్, కరీంనగర్ జిల్లా: వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆరేపల్లి సర్పంచ్ వర్నె లావణ్య మోహన్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా ఆరేపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు.

ఆరేపల్లిలో ముగ్గురికి సీఎం రిలీఫ్ చెక్కులు నిరుపేదలకు వరం

ఈ సందర్భంగా ధూమాల శ్రీధర్‌కు ₹.39,000, మొగిలి రాజయ్యకు ₹.20,000, మునిపాల తిరుపతికి ₹.10,500 చొప్పున మొత్తం ₹.69,500 విలువైన చెక్కులను అందజేశారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందని సర్పంచ్ పేర్కొన్నారు. అనారోగ్య సమయంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కోలే అశోక్, బుద్ధుల తిరుపతి, వర్నె సతీష్, లొల్లేటి విజేందర్, శ్రీనివాస్, మీసా మల్లయ్య, వార్డు సభ్యులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.