భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ రెడ్డి సరోత్తమ్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా డీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్‌తో పాటు మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు హాజరయ్యారు.
సమావేశం అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. రామ్ రెడ్డి సరోత్తమ్ రెడ్డి దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన విద్యావంతుడని, సేవాభావం కలిగిన యువ నాయకుడని తెలిపారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థి కావడంతో ఆయన గెలుపు ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, డీసీసీ అధ్యక్షుడు ఉమా మురళి నాయక్ సమావేశంలో స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.
పట్టభద్రులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సరోత్తమ్ రెడ్డికి అవగాహన ఉందని అశోక్ గౌడ్ తెలిపారు. పట్టభద్రులు, ఉద్యోగులు ఆయనకు మద్దతు తెలపాలని అభ్యర్థించినట్లు చెప్పారు. చట్టసభల్లో అవకాశం కల్పిస్తే వారి సమస్యల పరిష్కారం కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తానని సరోత్తమ్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వివరించారు.
ఈ సందర్భంగా సరోత్తమ్ రెడ్డి ఇనుగుర్తి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఎమ్మెల్సీ ఎన్నికల పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు అశోక్ గౌడ్ తెలిపారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ఇనుగుర్తి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గంజి రాజేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖల అధ్యక్షులు తదితరులు తరలివెళ్లారు.