భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన సహాయక ఉపకరణాలను అందించేందుకు హుస్నాబాద్‌లో నిర్వహించిన అలింకో గుర్తింపు శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరం సజావుగా సాగేందుకు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఇతరులకు కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు వెన్న రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వెన్న రాజు మాట్లాడుతూ.. శిబిరం విజయవంతం కావడంలో సంబంధిత శాఖల అధికారులు, అలింకో సంస్థ ప్రతినిధులు అందించిన సహకారం ఎంతో అభినందనీయమన్నారు. గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం వల్ల శిబిరం విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు.
దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శిబిరం నిర్వహణకు ప్రత్యేక చొరవ తీసుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వెన్న రాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన వారికి అవసరమైన సహాయక ఉపకరణాలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతోమందికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
శిబిరంలో వైద్య పరీక్షలు, ఇతర పరిశీలనల ద్వారా అర్హులుగా గుర్తించిన లబ్ధిదారులకు అవసరమైన ఉపకరణాలను మరికొద్ది రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు వెన్న రాజు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపకరణాలు అందేలా తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. శిబిరం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు.