భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన సహాయక ఉపకరణాలను అందించేందుకు హుస్నాబాద్‌లో నిర్వహించిన అలింకో గుర్తింపు శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరం సజావుగా సాగేందుకు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఇతరులకు కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు వెన్న రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వెన్న రాజు మాట్లాడుతూ.. శిబిరం విజయవంతం కావడంలో సంబంధిత శాఖల అధికారులు, అలింకో సంస్థ ప్రతినిధులు అందించిన సహకారం ఎంతో అభినందనీయమన్నారు. గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ వివిధ…






