భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే బత్తుల భరోసా

కాటవరం పడవ ప్రమాదంపై ఎమ్మెల్యే బత్తుల పరామర్శ.. గాలింపు చర్యలు ముమ్మరం
కాటవరం పడవ ప్రమాదంపై ఎమ్మెల్యే బత్తుల పరామర్శ.. గాలింపు చర్యలు ముమ్మరం

భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలం కాటవరం గ్రామానికి చెందిన కలిదిండి రాజేష్ పడవ ప్రమాదంలో గల్లంతైన ఘటనపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. స్థానిక గ్రామస్తులు, ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారిని అడిగి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

కాటవరం పడవ ప్రమాదంపై ఎమ్మెల్యే బత్తుల పరామర్శ.. గాలింపు చర్యలు ముమ్మరం

గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ, పోలీస్, విపత్తు నిర్వహణ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. SDRF బృందాలను రంగంలోకి దించి గల్లంతైన యువకుడిని వీలైనంత త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గాలింపు చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

కాటవరం పడవ ప్రమాదంపై ఎమ్మెల్యే బత్తుల పరామర్శ.. గాలింపు చర్యలు ముమ్మరం

అనంతరం ప్రమాదంలో గల్లంతైన రాజేష్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరామర్శించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం, తన తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కాటవరం పడవ ప్రమాదంపై ఎమ్మెల్యే బత్తుల పరామర్శ.. గాలింపు చర్యలు ముమ్మరం

గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం అధికారులు, SDRF సిబ్బంది గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. యువకుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు సహాయక బృందాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.