భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలం కాటవరం గ్రామానికి చెందిన కలిదిండి రాజేష్ పడవ ప్రమాదంలో గల్లంతైన ఘటనపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. స్థానిక గ్రామస్తులు, ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారిని అడిగి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు…



