భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

వధూవరులను ఆశీర్వదించిన సర్పంచి ఉష అశోక్

వధూపరులను ఆశీర్వదించిన సర్పంచి ఉష అశోక్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్లో దంతు సంతోష్ యాదవ్, శృతిల వివాహ వేడుక బుధవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఎర్రబెల్లిగూడెం గ్రామ సర్పంచి గుండెబోయిన ఉష అశోక్ యాదవ్‌తో పాటు పలువురు గ్రామ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను సర్పంచి ఉష అశోక్ యాదవ్ ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో పాల్గొన్న ఇతర ప్రముఖులు కూడా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి సాంబరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారు మల్లయ్య యాదవ్, కారోబార్ల సంఘం మండల అధ్యక్షుడు రాములు, గ్రామ పెద్దలు, సంతోష్ యాదవ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.