భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్లో దంతు సంతోష్ యాదవ్, శృతిల వివాహ వేడుక బుధవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఎర్రబెల్లిగూడెం గ్రామ సర్పంచి గుండెబోయిన ఉష అశోక్ యాదవ్‌తో పాటు పలువురు గ్రామ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను సర్పంచి ఉష అశోక్ యాదవ్ ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. వివాహ వేడుకలో పాల్గొన్న ఇతర ప్రముఖులు కూడా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు.
…






