భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

హక్కులతో పాటు విధులపైనా అవగాహన ఉండాలి

రాజ్యాంగ విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలి – సిద్దిపేట డీఐఈఓ మాధవరావు

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: విద్యార్థులు రాజ్యాంగ విలువలను తమ జీవితాల్లో అలవర్చుకోవడంతో పాటు ప్రాథమిక హక్కులు, విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) మాధవరావు సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాజ్యాంగ విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలి – సిద్దిపేట డీఐఈఓ మాధవరావు

ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని గుర్తుచేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన పనిచేసిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించిందని కొనియాడారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ స్థాయి నుంచే రాజ్యాంగ విలువలను అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టాలని సూచించారు. దీనివల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడంతో పాటు భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని తెలిపారు.

అనంతరం అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి రాజ్యాంగ పీఠికను పఠించారు. దేశ సమగ్రతను కాపాడుతూ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.

రాజ్యాంగ విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలి – సిద్దిపేట డీఐఈఓ మాధవరావు

రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం అనంతరం కళాశాల అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన డీఐఈఓ, రానున్న వార్షిక పరీక్షలకు సంబంధించి 45 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేసి విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు అందించేలా కృషి చేయాలని సూచించారు. కళాశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మరింత పెంచాలని, ఈ ఏడాది వార్షిక పరీక్షల ఫలితాల్లో సిద్దిపేట జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధ్యాపకులు సమష్టిగా పనిచేయాలని కోరారు.

రాజ్యాంగ విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలి – సిద్దిపేట డీఐఈఓ మాధవరావు

అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలకు ముందుగానే ప్రణాళిక రూపొందించుకొని క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. గంగాధర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి టి. రణధీర్ కుమార్, అధ్యాపకులు వి. రజనీ, ఎస్. సత్యనారాయణ, వి. సదాశివ్, బి. ఎల్లయ్య, ఎస్. వెంకట ముత్యం, బి. వాల్య, సీహెచ్. విద్యాసాగర్, పి. చంద్రమోహన్, సీహెచ్. రాజిరెడ్డి, ఎస్. అశోక్, గ్రంథపాలకురాలు ఆర్. వాసవి, ఏ. మమత, ఆర్. వెంకటేష్, అధ్యాపకేతర సిబ్బంది వెంకట సాయి, శ్వేత, విద్యార్థులు పాల్గొన్నారు.