భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: విద్యార్థులు రాజ్యాంగ విలువలను తమ జీవితాల్లో అలవర్చుకోవడంతో పాటు ప్రాథమిక హక్కులు, విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) మాధవరావు సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని గుర్తుచేశారు. డాక్టర్…






