భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

చిన్నారుల ఎదుగుదలకు తొలిముద్ద కార్యక్రమం

ఆలేరులో అంగన్వాడి తొలిముద్ద ప్రారంభం..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించి వారి ఎదుగుదలకు తోడ్పడే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘తొలిముద్ద’ కార్యక్రమం ఆలేరు పరిధిలో గురువారం ప్రారంభమైంది. సూపర్వైజర్ నీరజ ఆదేశాల మేరకు మండలంలోని ఆలేరు పరిధి అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. స్థానిక ఎంపీపీఎస్‌లో గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి, HM సైదులు పాషా, అంగన్వాడీ టీచర్లతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఉప్మా, కిచిడి వంటి అల్పాహారాన్ని వడ్డించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న ప్రీ స్కూల్ చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించేందుకు తొలిముద్ద కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఆలేరులో అంగన్వాడి తొలిముద్ద ప్రారంభం..

చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ద్వారా వారి ఎదుగుదలకు, ఆరోగ్యానికి మరింత తోడ్పాటు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు అక్తర్, అంగన్వాడీ టీచర్లు కె. మంజుల, దేవకి, సునీత, ఆశా వర్కర్ నీరజ, ఆయాలు, చిన్నారులు, తల్లులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.