భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించి వారి ఎదుగుదలకు తోడ్పడే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘తొలిముద్ద’ కార్యక్రమం ఆలేరు పరిధిలో గురువారం ప్రారంభమైంది. సూపర్వైజర్ నీరజ ఆదేశాల మేరకు మండలంలోని ఆలేరు పరిధి అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. స్థానిక ఎంపీపీఎస్‌లో గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి, HM సైదులు పాషా, అంగన్వాడీ టీచర్లతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఉప్మా, కిచిడి వంటి అల్పాహారాన్ని వడ్డించారు.
ఈ…






