భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

కోనాపూర్‌లో వర్షం దెబ్బకు రైతులకు తీరని నష్టం

బుధవారం రాత్రి అకాల వర్షం కారణంగా కోనాపూర్ గ్రామంలో వడ్లు తడిసి కొట్టుకపోవడం కారణంగా బిఆర్ఎస్ నాయకుర

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. బుధవారం రాత్రి కురిసిన వర్షంతో మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో బండమీద ఆరబెట్టుకున్న వరి ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. సుమారు 50 ట్రాక్టర్ల వడ్లను ఆరబెట్టుకోగా, వర్షం కారణంగా 20 నుంచి 30 ట్రాక్టర్ల వడ్లు బండ కిందకు కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు.

బుధవారం రాత్రి అకాల వర్షం కారణంగా కోనాపూర్ గ్రామంలో వడ్లు తడిసి కొట్టుకపోవడం కారణంగా బిఆర్ఎస్ నాయకుర

విషయం తెలుసుకున్న మెదక్ మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి గురువారం కోనాపూర్ గ్రామానికి చేరుకుని నష్టపోయిన రైతులను పరామర్శించారు. వర్షం కారణంగా కొట్టుకుపోయిన వడ్లను పరిశీలించి రైతుల నుంచి నష్టం వివరాలను తెలుసుకున్నారు. అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వెంటనే RDO, MROలకు ఫోన్ చేసి వర్షం కారణంగా నష్టపోయిన రైతుల వివరాలను పరిశీలించి, వారికి త్వరగా నష్టపరిహారం అందేలా చూడాలని సూచించారు.

బుధవారం రాత్రి అకాల వర్షం కారణంగా కోనాపూర్ గ్రామంలో వడ్లు తడిసి కొట్టుకపోవడం కారణంగా బిఆర్ఎస్ నాయకుర

పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ MPP బిక్షపతి, మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, శంకరంపేట పార్టీ అధ్యక్షుడు పరిటాల రాజు, రామాయంపేట యూత్ మండల అధ్యక్షుడు రాగి ఉమామహేశ్వర్, కోనాపూర్ మాజీ సర్పంచ్ ఇమెయిల్, సంజీవ్, వెంకట్ రెడ్డి, సుశీల్, రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.