భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. బుధవారం రాత్రి కురిసిన వర్షంతో మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో బండమీద ఆరబెట్టుకున్న వరి ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. సుమారు 50 ట్రాక్టర్ల వడ్లను ఆరబెట్టుకోగా, వర్షం కారణంగా 20 నుంచి 30 ట్రాక్టర్ల వడ్లు బండ కిందకు కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు.
విషయం తెలుసుకున్న మెదక్ మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి గురువారం కోనాపూర్ గ్రామానికి చేరుకుని…






