భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రాజ్యాంగ పరిరక్షణకు పార్టీలకతీతంగా ఐక్యంగా ఉద్యమించాలి

రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి**  **ప్రజల్లో రాజ్యాంగ విలువలపై చైతన్యం తీసుకురావాలి**

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కుల, మత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడంతో పాటు రాజ్యాంగం అందించిన విలువలపై ప్రజల్లో విస్తృతంగా చైతన్యం తీసుకురావాలని సూచించారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాజ్యాంగ ప్రాధాన్యత, దాని పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు.

రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి**  **ప్రజల్లో రాజ్యాంగ విలువలపై చైతన్యం తీసుకురావాలి**

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ ప్రజల హక్కులకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాల్లో ఒకటైన భారత రాజ్యాంగం భిన్న మతాలు, కులాలు, సంస్కృతులు, ప్రాంతాలకు చెందిన ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌తో పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యులు చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం రాజ్యాంగంలోని ప్రధాన లక్ష్యాలని వివరించారు.

ప్రస్తుతం రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నాయకులు సూచించారు. రాజ్యాంగంలో అవసరమైన సవరణలు చేయడానికి, రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేయాలనే ఆలోచనలకు మధ్య ఉన్న తేడాను ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. కులం, మతం, జాతి, లింగ వివక్షకు తావులేకుండా రాజ్యాంగం అందించిన స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.

రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి**  **ప్రజల్లో రాజ్యాంగ విలువలపై చైతన్యం తీసుకురావాలి**

రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, కుల, మత, వర్గాల ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గత రెండేళ్లుగా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని 173 గ్రామాల్లో మహిళా సంఘాలు, వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో సుమారు 65 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా రాజ్యాంగ హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఈ చైతన్య కార్యక్రమాలను కొనసాగిస్తూ రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ JAC కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్లెపల్లి వెంకటరమణ, వెన్నరాజు, కౌన్సిలర్లు కొండ రజిత, గాదెపాక రవీందర్, BSP నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, JAC, కాంగ్రెస్, BRS, BSP నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.