భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కుల, మత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడంతో పాటు రాజ్యాంగం అందించిన విలువలపై ప్రజల్లో విస్తృతంగా చైతన్యం తీసుకురావాలని సూచించారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా…






