భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

హుస్నాబాద్‌లో అలింకో శిబిరానికి భారీ స్పందన

అలింకో శిబిరానికి భారీ స్పందన  700 మందికి పైగా దివ్యాంగులు, వృద్ధుల హాజరు  చైర్ పర్సన్ దండి లక్ష్మి

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: దివ్యాంగులు, వయోవృద్ధులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు హుస్నాబాద్‌లో నిర్వహించిన అలింకో ఎంపిక శిబిరానికి భారీ స్పందన లభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అలింకో సంస్థ సహకారంతో హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి 700 మందికి పైగా దివ్యాంగులు, వయోవృద్ధులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు తరలిరావడంతో శిబిరం సందడిగా మారింది.

అలింకో శిబిరానికి భారీ స్పందన  700 మందికి పైగా దివ్యాంగులు, వృద్ధుల హాజరు  చైర్ పర్సన్ దండి లక్ష్మి

ఈ విషయాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి వెల్లడించారు. శిబిరానికి వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు వైద్యులు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితి, వ్యక్తిగత అవసరాలను బట్టి అవసరమైన సహాయ ఉపకరణాలను గుర్తించనున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం అర్హులైన వారికి అవసరమైన ఉపకరణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

అలింకో శిబిరానికి భారీ స్పందన  700 మందికి పైగా దివ్యాంగులు, వృద్ధుల హాజరు  చైర్ పర్సన్ దండి లక్ష్మి

వయోవృద్ధులకు చేతికర్రలు, నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అవసరమైన సహాయక ఉపకరణాలు, వినికిడి లోపం ఉన్నవారికి వినికిడి యంత్రాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులు, వృద్ధులు రోజువారీ పనులు చేసుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించి, వారికి మరింత సౌకర్యవంతమైన జీవనాన్ని అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

అలింకో శిబిరానికి భారీ స్పందన  700 మందికి పైగా దివ్యాంగులు, వృద్ధుల హాజరు  చైర్ పర్సన్ దండి లక్ష్మి

మానవసేవే మాధవసేవ అనే భావనతో మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు అండగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని దండి లక్ష్మి అన్నారు. శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. అర్హులైన వారందరికీ వారి అవసరాలకు తగిన సహాయ ఉపకరణాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అలింకో శిబిరానికి భారీ స్పందన  700 మందికి పైగా దివ్యాంగులు, వృద్ధుల హాజరు  చైర్ పర్సన్ దండి లక్ష్మి

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి, మాజీ MPP ఆకుల వెంకట్, మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున్, కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వి. వెంకటరమణ, పట్టణ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.