భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: దివ్యాంగులు, వయోవృద్ధులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు హుస్నాబాద్‌లో నిర్వహించిన అలింకో ఎంపిక శిబిరానికి భారీ స్పందన లభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అలింకో సంస్థ సహకారంతో హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి 700 మందికి పైగా దివ్యాంగులు, వయోవృద్ధులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు తరలిరావడంతో శిబిరం సందడిగా మారింది.
ఈ విషయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి వెల్లడించారు. శిబిరానికి వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు వైద్యులు ప్రత్యేకంగా పరీక్షలు…






