భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

విద్యార్థినులు రాజ్యాంగ విలువలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ప్రిన్సిపాల్ వి. లలిత

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, అధ్యాపకులు రాజ్యాంగ విలువలను గుర్తుచేసుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు.

విద్యార్థినులు రాజ్యాంగ విలువలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ప్రిన్సిపాల్ వి. లలిత

కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ వి. లలిత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలను గుర్తుంచుకుంటూ ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వి. లలిత మాట్లాడుతూ విద్యార్థినులు భారత రాజ్యాంగ ఆవిర్భావం, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని సూచించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో పాటు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవాలని చెప్పారు. చదువుతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనాలని, పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను సాధించాలని విద్యార్థినులకు పిలుపునిచ్చారు.

విద్యార్థినులు రాజ్యాంగ విలువలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ప్రిన్సిపాల్ వి. లలిత

రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు టి. నిర్మలాదేవి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన కృషిని వివరించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, వివిధ అధికరణల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా గుర్తించాలని సూచించారు.

ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డి. కర్ణాకర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించడం, దాని పరిరక్షణకు కృషి చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల్లో రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచాలని చెప్పారు.

విద్యార్థినులు రాజ్యాంగ విలువలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ప్రిన్సిపాల్ వి. లలిత

కార్యక్రమం అనంతరం రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు టి. నిర్మలాదేవిని ప్రిన్సిపాల్ వి. లలితతో పాటు అధ్యాపక బృందం శాలువాతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డి. కర్ణాకర్ పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డి. రవీందర్, ఎస్. సదానందం, బి. లక్ష్మయ్య, కె. స్వరూప, ఎస్. కవిత, జి. కవిత, ఆస్మా ఫిర్దోస్, ఓ. రాణి, జూనియర్ అసిస్టెంట్లు ఎస్. రాములు, కె. గీతాంజలి, రికార్డు అసిస్టెంట్ టి. రమాదేవి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.