భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, అధ్యాపకులు రాజ్యాంగ విలువలను గుర్తుచేసుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు.

కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ వి. లలిత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు,…