భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

సేవాలాల్ ఆలయ నిర్మాణం గర్వకారణం: బాలాజీ నాయక్

సేవాలాల్ ఆలయ నిర్మాణం లంబాడాలకు గర్వకారణం..                డిసిసి ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్  భూమి పూ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: లంబాడాల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం ఆ సామాజిక వర్గానికి గర్వకారణమని మహబూబాబాద్ DCC ఉపాధ్యక్షులు గుగులోతు బాలాజీ నాయక్ తెలిపారు. లంబాడాల ఆత్మగౌరవాన్ని చాటేలా భారీ స్థాయిలో ఆలయ నిర్మాణం చేపట్టడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా మద్దిమడుగులో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి గురువారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. నెల్లికుదురు, మహబూబాబాద్, ఇనుగుర్తి, గూడూరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా బయలుదేరారు.

ఈ సందర్భంగా DCC ఉపాధ్యక్షులు గుగులోతు బాలాజీ నాయక్ మాట్లాడుతూ మానుకోట ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్, DCC అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ పిలుపు మేరకు నాలుగు మండలాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు, గిరిజనులు భారీగా తరలివెళుతున్నట్లు తెలిపారు. శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణం లంబాడాల ఆధ్యాత్మిక విశ్వాసాలకు, ఆత్మగౌరవానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 20 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ₹.150 కోట్ల భారీ బడ్జెట్‌తో సేవాలాల్ ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు చర్యలు చేపడుతోందని బాలాజీ నాయక్ వివరించారు. లంబాడాల ఆరాధ్య దైవానికి ఇంతటి భారీ ఆలయం నిర్మించడం ఆ వర్గ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. భూమి పూజ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు, కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు వీరన్న, హేమలత, శ్రీను, ధనమ్మ, అమృ, అశోక్, సోమన్న, అంబరు తదితరులు పాల్గొన్నారు. పలు మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.