భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

రాజ్యాంగాన్ని గౌరవించడం మన బాధ్యత          ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వెంకన్న

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారత రాజ్యాంగాన్ని గౌరవించడం, అందులో పొందుపరిచిన విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఎమ్మార్పీఎస్ నెల్లికుదురు మండల అధ్యక్షుడు తూల్ల వెంకన్న తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం) సందర్భంగా గురువారం నెల్లికుదురు మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

రాజ్యాంగాన్ని గౌరవించడం మన బాధ్యత          ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వెంకన్న

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తూల్ల వెంకన్న మాట్లాడుతూ రాజ్యాంగం దేశ ప్రజలకు అందించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

మానవ హక్కుల పరిరక్షణ, న్యాయ సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని వెంకన్న పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, న్యాయం అమలయ్యేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే రాజ్యాంగానికి నిజమైన గౌరవం ఇచ్చినవారమవుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శులు జల్ల ఉపేందర్, హెచ్. అశోక్‌తో పాటు నాయకులు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, ఆలకుంట్ల సాయిలు, పోరండ్ల గణేష్, చాగంటి రవి, తూల్ల వివేక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.