భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారత రాజ్యాంగాన్ని గౌరవించడం, అందులో పొందుపరిచిన విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఎమ్మార్పీఎస్ నెల్లికుదురు మండల అధ్యక్షుడు తూల్ల వెంకన్న తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సంవిధాన్ దివస్ (రాజ్యాంగ దినోత్సవం) సందర్భంగా గురువారం నెల్లికుదురు మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని…






