భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఆర్గానిక్ సాగుతో భూమికి బలం.. రైతుకు లాభం

ఆర్గానిక్ సాగు భూమికి బలం రైతుకు లాభం..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆర్గానిక్ సాగు విధానాలతో భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు రైతులు మెరుగైన దిగుబడులు సాధించి ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంటుందని AWPL వెల్నెస్ కంపెనీ అగ్రికల్చర్ ట్రైనర్ నరేందర్, హెల్త్ ట్రైనర్ కరుణాకర్, వెల్త్ ట్రైనర్ వసంతరావు తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల భూమి సారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో 'ఆరోగ్య భారత్.. సంపన్న భారత్' (హెల్త్ ఇండియా.. వెల్త్ ఇండియా) కార్యక్రమంలో భాగంగా రైతులకు సహజ సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారతీయ కంపెనీ ఆశ్లీ PS వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు, వాటి ప్రయోజనాలు, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు.

ఈ సందర్భంగా ట్రైనర్లు మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తమ కంపెనీ వివిధ రకాల ప్రొడక్టులను తయారు చేసిందని తెలిపారు. ఇవి రసాయన ఎరువులు, పురుగుమందులతో పోలిస్తే తక్కువ ధరలకు లభిస్తాయని, భూమికి, పంటలకు మేలు చేసేలా రూపొందించినట్లు వివరించారు. రైతులు సాగు ఖర్చులను తగ్గించుకుంటూ సహజ పద్ధతుల వైపు అడుగులు వేయాలని సూచించారు.

దేశానికి 16 సంవత్సరాల పాటు సేవలందించిన మేజర్ సంజీవ్ కుమార్ భారతదేశ రైతులను, వారి భూములను రసాయన ఆధారిత సాగు నుంచి కాపాడాలనే ఉద్దేశంతో సంబంధిత కంపెనీని ఏర్పాటు చేసినట్లు ట్రైనర్లు వెల్లడించారు. వ్యవసాయంలో సహజ పద్ధతులపై అవగాహన పెంచడం, రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ బైరు రమేష్‌తో పాటు రైతులు బైరు శ్రీనివాస్ గౌడ్, బైరు శ్రీరాములు, గుండ్ల యాకయ్య, బత్తిని రాములు, బైరు యాదగిరి, ప్రసాద్, మురళి, నాయిని కొమరయ్య, పంజాల దేవరాజు, వేణు, పంజాల రమేష్, చెడుపాక రమేష్, మునిగింటి దర్గయ్య తదితరులు పాల్గొన్నారు.