భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఇంటింటికీ బొట్టు పెట్టి దీక్షా దివస్ సభకు ఆహ్వానం

దీక్షా దివస్ సభకు మహిళలు భారీగా తరలిరావాలి హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇంటింటికీ
దీక్షా దివస్ సభకు మహిళలు భారీగా తరలిరావాలి హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇంటింటికీ

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 29న దీక్షా దివస్ సందర్భంగా BRS పార్టీ ఆధ్వర్యంలో అల్గునూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ హుస్నాబాద్ పట్టణంలో మహిళా విభాగం నాయకులు ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి సభకు ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో సభకు హాజరై తమ మద్దతు తెలియజేయాలని కోరారు.

దీక్షా దివస్ సభకు మహిళలు భారీగా తరలిరావాలి హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇంటింటికీ

ఈ సందర్భంగా 18వ వార్డు కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 16 రోజుల పాటు పోరాటం చేశారని తెలిపారు. ఆయన చేపట్టిన దీక్ష, పోరాటం ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో దీక్షా దివస్‌కు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని, ఆ చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ అల్గునూరులో నిర్వహిస్తున్న భారీ సభకు మహిళలంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

దీక్షా దివస్ సభకు మహిళలు భారీగా తరలిరావాలి హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇంటింటికీ

అనంతరం 17వ వార్డు కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించేందుకు మహిళలంతా ఐక్యంగా సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ భారీ బహిరంగ సభకు యువతీ యువకులు, సోదర సోదరీమణులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

దీక్షా దివస్ సభకు మహిళలు భారీగా తరలిరావాలి హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇంటింటికీ

ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్ రావు, 17వ వార్డు కౌన్సిలర్ గాదెపాక రవీందర్, BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు పెరుక భాగ్యరెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా, మాజీ కౌన్సిలర్ బొజు రమ రవీందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏడబోయిన రజిని, మాజీ ఎంపీపీ లకావత్ మానస, మాజీ ZPTC భూక్య మంగ, మహిళా నాయకులు బండి పుష్ప, చిదురాల అశ్విని, భారతమ్మ, అనురాధ, అంజలి, నాయకులు మిల్కూరి రవి, గడ్డం సదానందం తదితరులు పాల్గొన్నారు.