భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

గ్రామస్థాయి నుంచి ప్రచారం ముమ్మరం చేయాలి.. ఎమ్మెల్యే సూచన

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయ సమావేశం
స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయ సమావేశం

భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. సీతానగరం మండలం ముగ్గళ్ల గ్రామంలో కూటమి పార్టీల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయ సమావేశం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. ముగ్గళ్ల గ్రామంలో కూటమికి ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని, ఈ మద్దతును ఎన్నికల్లో విజయంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి, కూటమికి మరింత మద్దతు కూడగట్టాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయ సమావేశం

అలాగే గ్రామంలో ఉన్న సమస్యలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, బూత్ స్థాయిలో ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై నాయకులతో చర్చించారు. ఎన్నికల సమయంలో ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేస్తూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు. కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరి సమిష్టి కృషి, సమన్వయంతో ముగ్గళ్ల పంచాయతీలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా సమన్వయ సమావేశం

ఈ సమావేశంలో కూటమి నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యువజన, మహిళా విభాగాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.