భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. సీతానగరం మండలం ముగ్గళ్ల గ్రామంలో కూటమి పార్టీల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి వెళ్లాల్సిన అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. ముగ్గళ్ల గ్రామంలో కూటమికి ప్రజల నుంచి మంచి…




