భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

అర్హులైన ప్రతి కుటుంబం బీమా పథకంలో చేరాలి

అర్హులైన ప్రతి కుటుంబం బీమా పథకంలో నమోదు చేసుకోవాలి 13వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తు

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్ కోరారు. హుస్నాబాద్ పట్టణంలోని 13వ వార్డు పరిధిలో గోదాం గడ్డ బస్తీ దవాఖానలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకారంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని బీమా పథకంలో నమోదు చేసుకోవాలని సూచించారు.

అర్హులైన ప్రతి కుటుంబం బీమా పథకంలో నమోదు చేసుకోవాలి 13వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తు

ఈ పథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన అర్హులైన కుటుంబ సంపాదనపరుడికి ₹.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్ వివరించారు. బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి ₹.5 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచే ఈ పథకంలో అర్హులైన వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు.

అర్హులైన ప్రతి కుటుంబం బీమా పథకంలో నమోదు చేసుకోవాలి 13వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తు

దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే దానితో పాటు మొబైల్ నంబర్, నామినీ వివరాలను తీసుకురావాలని సూచించారు. 13వ వార్డులోని అర్హులైన కుటుంబాలకు పథకంపై అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తుల నమోదు ప్రక్రియలో అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.