భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

నాగసముద్రాల మోడల్ స్కూల్ వద్ద రాస్తారోకో

నాగసముద్రాల మోడల్ స్కూల్ మధ్యలో రోడ్డు నిర్మాణం వద్దు అలైన్‌మెంట్ మార్చాలని బీజేపీ నాయకుల రాస్తారోకో

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: కోహెడ మండలం నాగసముద్రాల తెలంగాణ మోడల్ స్కూల్ ప్రాంగణం మధ్య నుంచి ప్రతిపాదించిన రహదారి నిర్మాణ అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ BJP నాయకులు, గ్రామస్తులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. హుస్నాబాద్‌–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణం మధ్య నుంచి డబుల్ రోడ్డు నిర్మిస్తే సుమారు 700 నుంచి 800 మంది విద్యార్థుల భవిష్యత్తుతో పాటు పాఠశాల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని, జిల్లా కలెక్టర్ స్వయంగా పాఠశాలను సందర్శించి సమస్యను పరిష్కరించాలని కోరారు. సుమారు గంటపాటు కొనసాగిన రాస్తారోకోను కోహెడ పోలీసులు నచ్చజెప్పడంతో నిరసనకారులు విరమించారు.

నాగసముద్రాల మోడల్ స్కూల్ మధ్యలో రోడ్డు నిర్మాణం వద్దు అలైన్‌మెంట్ మార్చాలని బీజేపీ నాయకుల రాస్తారోకో
నాగసముద్రాల మోడల్ స్కూల్ మధ్యలో రోడ్డు నిర్మాణం వద్దు అలైన్‌మెంట్ మార్చాలని బీజేపీ నాయకుల రాస్తారోకో

ఈ సందర్భంగా BJP జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం మాట్లాడుతూ.. సర్వే నంబరు 263లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీతో నిర్మించిన మోడల్ స్కూల్ ప్రాంగణాన్ని రహదారి నిర్మాణం కోసం రెండుగా విభజించడం సరికాదన్నారు. రోడ్డు నిర్మాణంతో పాఠశాల స్థలంలో కొంతభాగం కోల్పోవాల్సి వస్తుందని, విద్యార్థులకు ఆటస్థలం లేకుండా పోవడంతో పాటు రాకపోకల కారణంగా వారి భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎల్కతుర్తి నుంచి సంగారెడ్డి వరకు నిర్మిస్తున్న ప్రధాన రహదారి అలైన్‌మెంట్‌ను నాగసముద్రాల మోడల్ స్కూల్ వద్ద మాత్రమే ఎస్ ఆకారంలో రూపొందించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడుసార్లు సర్వే నిర్వహించినప్పటికీ విద్యార్థులకు నష్టం కలిగించే విధంగానే అలైన్‌మెంట్ రూపొందించడంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.