భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని NIMS ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన యువతి హారిక వైద్య ఖర్చుల కోసం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఆర్థిక సాయం అందించారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని నెల్లికుదురు మండలం రత్తిరామ్ తండాకు చెందిన గుగులోతు వెంకన్న కుమార్తె హారిక అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు.
హారిక కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించడం కష్టంగా మారిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ వెంటనే స్పందించారు. హారికకు మెరుగైన వైద్యం అందించేందుకు ₹.10 లక్షల విలువైన ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్సకు ఆటంకం కలగకుండా ఈ సాయం ఉపయోగపడనుంది.
ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి వైద్య సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్‌కు రత్తిరామ్ తండా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.