భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్యమిత్రులు

మిత్రమా.!మల్లేష్..నీ జ్ఞాపకాలను మరువలేం..  కుటుంబానికి ఫ్రెండ్స్ ఆర్థిక సహాయం అందజేత

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ‘మిత్రమా.. మల్లేష్.. నీ జ్ఞాపకాలను మరువలేం’ అంటూ బాల్యమిత్రులు తమ స్నేహితుడి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అనారోగ్యంతో కన్నుమూసిన స్నేహితుడిని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ఈ ఘటన నెల్లికుదురు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

నెల్లికుదురుకు చెందిన అల్వాల మల్లేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆయన బాల్యమిత్రులు జర్నలిస్టు మస్కపురి సుధాకర్, పోతుగంటి శ్రీనివాస్, గుండెబోయిన అశోక్, బందారపు వేణు, సలుగు శ్రీను, గుండ్ల రాము, డీలర్ శ్రీను, పులి శ్రీనివాస్, పులి జంపయ్య, పులి రమేష్, రత్నపురపు యాకయ్య తదితరులు మల్లేష్ ఇంటికి చేరుకున్నారు.

మిత్రమా.!మల్లేష్..నీ జ్ఞాపకాలను మరువలేం..  కుటుంబానికి ఫ్రెండ్స్ ఆర్థిక సహాయం అందజేత

అక్కడ మల్లేష్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. చిన్ననాటి నుంచి కలిసి ఆటపాటలతో గడిపిన రోజులు, అప్పట్లో పంచుకున్న సరదాలు, మాట్లాడుకున్న మాటలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమతో కలిసి పెరిగిన స్నేహితుడు ఇక లేడనే బాధతో భావోద్వేగానికి గురయ్యారు.

అనంతరం మల్లేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో మనోధైర్యాన్ని కోల్పోవద్దని, కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు. మల్లేష్ భౌతికంగా దూరమైనా, ఆయనతో కలిసి గడిపిన జ్ఞాపకాలు తమ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని మిత్రులు భావోద్వేగంగా పేర్కొన్నారు.