భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వైద్య చికిత్స ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అండగా నిలిచారు. నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామానికి చెందిన ప్యాట సత్య గౌడ్ కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం ₹.1,50,000 (ఒక లక్షా యాభై వేల రూపాయలు) విలువైన ఎల్‌ఓసీని ఎమ్మెల్యే అందజేశారు.
వైద్య చికిత్స కోసం అవసరమైన ఖర్చులను భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించారు. అనారోగ్య సమయంలో చికిత్సకు అవసరమైన ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ఎల్‌ఓసీ మంజూరు చేయడంతో కుటుంబానికి కొంత ఊరట లభించింది.
ఆపద సమయంలో తమకు అండగా నిలిచి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి ప్యాట సత్య గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.