భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

బీజేవైఎం నెల్లికుదురు మండల ఉపాధ్యక్షుడిగా నితిన్ గౌడ్

బీజేవైఎం నెల్లికుదురు మండల ఉపాధ్యక్షులుగా నితిన్ గౌడ్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: BJP యువజన విభాగం బీజేవైఎం నెల్లికుదురు మండల ఉపాధ్యక్షుడిగా వావిలాల గ్రామానికి చెందిన యువ నాయకుడు దేశగాని నితిన్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం మండల అధ్యక్షుడు పెరుమాండ్ల శివ సాయి గౌడ్ శుక్రవారం నితిన్ గౌడ్‌కు నియామక ధ్రువపత్రాన్ని అందజేశారు.

బీజేవైఎం బలోపేతానికి కృషి చేస్తా: నితిన్ గౌడ్

నెల్లికుదురు మండలంలో బీజేవైఎంను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నూతన మండల ఉపాధ్యక్షుడు నితిన్ గౌడ్ తెలిపారు. BJP, యువ మోర్చా సిద్ధాంతాలతో పాటు ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్తానని పేర్కొన్నారు. యువతను పార్టీ, యువ మోర్చా కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తూ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.

తనపై నమ్మకం ఉంచి మండల ఉపాధ్యక్షుడిగా నియమించిన బీజేవైఎం మండల అధ్యక్షుడు పెరుమాండ్ల శివ సాయి గౌడ్‌కు, తనకు సహకారం అందించిన BJP మండల అధ్యక్షుడు చందు రాజ్ కుమార్ యాదవ్, బాలగాని రంజిత్ గౌడ్‌తో పాటు బీజేవైఎం, BJP నాయకులకు నితిన్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.