భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

పెళ్లిరోజున ఆధ్యాత్మిక సేవ

వజనేపల్లి దంపతుల మ్యారేజ్ డే స్వాములకు బిక్ష

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పెళ్లిరోజు వేడుకను ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంతో జరుపుకుంటూ వజనేపల్లి శ్రీధర్, కవిత దంపతులు తమ భక్తిని చాటుకున్నారు. తమ మ్యారేజ్ డే సందర్భంగా ఇనుగుర్తి, అయ్యగారిపల్లి గ్రామాలకు చెందిన 70 మంది అయ్యప్ప దీక్ష స్వాములకు శుక్రవారం బిక్ష ఏర్పాటు చేశారు. మండల కేంద్రం ఇనుగుర్తిలోని స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వజనేపల్లి దంపతుల మ్యారేజ్ డే స్వాములకు బిక్ష

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. మణికంఠ స్వామి ఆశీస్సులతో తమ కళ్యాణ రోజు అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పెళ్లిరోజు సందర్భంగా స్వాములకు సేవ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో గురుస్వాములు, జర్నలిస్ట్ గంజి వీరేందర్ రెడ్డి, లింగాల నరసయ్య, కమటం కృష్ణమూర్తి, సందీప్, మలిశెట్టి శోభన్, మట్టపల్లి అశోక్, శ్రీరామ్ శ్రీరాములు, బూర రాజేష్, నాళ్ల రఘువీర్‌తో పాటు పలువురు కత్తి, గదా తదితర అయ్యప్ప దీక్ష స్వాములు పాల్గొన్నారు.