భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పెళ్లిరోజు వేడుకను ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంతో జరుపుకుంటూ వజనేపల్లి శ్రీధర్, కవిత దంపతులు తమ భక్తిని చాటుకున్నారు. తమ మ్యారేజ్ డే సందర్భంగా ఇనుగుర్తి, అయ్యగారిపల్లి గ్రామాలకు చెందిన 70 మంది అయ్యప్ప దీక్ష స్వాములకు శుక్రవారం బిక్ష ఏర్పాటు చేశారు. మండల కేంద్రం ఇనుగుర్తిలోని స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. మణికంఠ స్వామి ఆశీస్సులతో తమ కళ్యాణ రోజు అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేసే అవకాశం…






