భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

నార్సింగి కొత్త ఎస్సైగా నరేష్ బాధ్యతలు

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత.. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు : ఎస్సై నరేష్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి పోలీస్ స్టేషన్‌కు నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై)గా నరేష్ నియమితులయ్యారు. శుక్రవారం ఆయన పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నార్సింగి ఎస్సైగా విధులు నిర్వహించిన బీమరి సృజన బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో నరేష్‌కు బాధ్యతలు అప్పగించారు.

ప్రస్తుతం రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో రెండో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నరేష్‌ను నార్సింగి ఎస్సైగా నియమిస్తూ మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు నరేష్ శుక్రవారం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా నూతన ఎస్సై నరేష్ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తానని చెప్పారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలంతా ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా పోలీస్ శాఖ తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు.