భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

మోదీ చారిత్రాత్మక నిర్ణయాలకు ఇనుగుర్తి బీజేపీ పాలాభిషేకం

"మోదీ"చారిత్రక బిల్లులు..ప్రధానికి పాలాభిషేకం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రం ఇనుగుర్తిలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని ప్రకటించారు.

బీజేపీ మండల అధ్యక్షుడు దుంపల సందీప్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మహిళల రాజకీయ సాధికారతకు మరింత బలం చేకూరుస్తాయని పార్టీ నాయకులు తెలిపారు.

ఈ నెల 27న శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మహిళా రిజర్వేషన్ అమలుకు అనుసంధానంగా డీలిమిటేషన్, పార్లమెంట్ స్థానాల పెంపునకు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలపడం కీలక నిర్ణయమని వారు పేర్కొన్నారు. ఈ చర్యలతో పార్లమెంట్‌లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉండటంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దుంపల సందీప్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు పాల్గొన్నారు.