భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రం ఇనుగుర్తిలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని ప్రకటించారు.

బీజేపీ మండల అధ్యక్షుడు దుంపల సందీప్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు…