భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, సెప్టెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

OG: ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే..?

OG-movie-pre-release

భారత్ సమాచార్.నెట్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రానికి భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. విడుదలకు మరో వారం రోజులే ఉండటంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 21న హైదరాబాద్ యూసఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్స్ వద్ద ఈ ఈవెంట్ జరగనుంది.

 

అయితే ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర నటీనటులు హాజరుకానుండగా.. ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా పాల్గొనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరగనుండగా.. ఏపీలో కూడా మరో ఈవెంట్‌‌ను ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.

 

ఇకపోతే సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా.. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో మరో రికార్డు నెలకొల్పే ఛాన్స్ ఉంది.