భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, సెప్టెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

Mother Dairy: తగ్గిన మదర్ డైరీ ఉత్పత్తుల ధరలు

motherdairy2-1758013645

భారత్ సమాచార్.నెట్: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు నిర్ణయంతో అనేక వస్తువులు వినియోగదారులకు చౌకగా లభిస్తున్నాయి. నిత్యావసర సరుకుల నుంచి పాల వరకు అన్నింటి ధరలు తగ్గుతున్నాయి. సెప్టెంబర్‌ 22 నుంచి జీఎస్టీలోని 5, 18 శాతం శ్లాబులు అమలు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనేక కంపెనీలు తమ తమ ప్రొడక్ట్స్ ధరల్ని తగిస్తున్నాయి.

 

ఈ క్రమంలోనే ప్రముఖ మదర్ డైరీ సంస్థ దసరా పండుగ కానుకగా మదర్ డైరీ ఉత్పత్తుల ధరలను తగించింది. ఒక్కో ప్రొడక్ట్‌, ప్యాకేజింగ్‌ను బట్టి రూ.2-30 మధ్య ధరల్ని తగ్గించింది. వీటికి సంబంధించిన లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో టోన్డ్ మిల్క్, పనీర్, బటర్, నెయ్యి, ఛీజ్, ప్రీమియం ఆవు నెయ్యి వంటివి ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్‌తో పాటు దేశంలోని అనని నగరాల్లో ఇప్పుడు మదర్ డైరీ ఉత్పత్తులు తక్కువ ధరకే లభించనున్నాయి.

 

1 లీటర్ టెట్రా ప్యాక్ మిల్క్ ధర గతంలో రూ.77గా ఉండగా.. ఇప్పుడు రూ.75కు తగ్గింది. 450 ఎంఎల్ డబుల్ టోన్డ్ మిల్క్ ధర రూ.33 నుంచి రూ.32 కు తగ్గింది. అదేవిధంగా 180 ఎంఎల్ మిల్క్ షేక్ ధరను రూ.30 నుంచి రూ.28 కు తగ్గించింది. 200 గ్రాముల మలై పనీర్ పాత ధర రూ.100 ఉండగా, కొత్త ధర రూ.95కు తగ్గించారు. 1 లీటరు నెయ్యి రూ.675 నుంచి రూ.645కి తగ్గించారు. అలాగే 180 గ్రాముల చీజ్ క్యూబ్స్ ధరను రూ.145 నుంచి రూ.135కి తగ్గించింది. అంతేకాదు మదర్ డైరీ ఐస్ క్రీం ధరలను కూడా తగ్గించింది.