భారత్ సమాచార్.నెట్: ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులకు ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది అమెరికాలోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ అవార్డులను ప్రధానం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అంతర్జాతీయ వేదికగా గౌరవించడం ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం.
1929 నుంచి ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇప్పటికి కొనసాగుతూ వస్తోంది. ప్రతి ఏడాది ఈ అవార్డు కోసం ఎన్నో చిత్రాలు పోటీ పడతుంటాయి. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల చిత్రాలు మొత్తంగా 24 సినిమాలు ఆస్కార్స్ అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. 2026 ఫిబ్రవరిలో జరగనున్న 98వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఆస్కార్ జాబితాలో చోటు దక్కించుకున్న చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన.. పుష్ప 2: ది రూల్
ధనుష్ నటించిన.. కుబేర
మంచు విష్ణు నటించిన హై బడ్జెట్ చిత్రం.. కన్నప్ప
వినూత్న కథనంతో తెరకెక్కిన చిత్రం.. సంక్రాంతికి వస్తున్నాం
చిన్నారుల కోసం రూపొందించిన.. గాంధీ తాతా చెట్టు వంటి టాలీవుడ్ చిత్రాలు బరిలో నిలిచాయి.
ఇక జాన్వీ కపూర్ నటించిన హోమ్ బౌండ్, టూ వాక్, తన్వీ ది గ్రేట్, ది బెంగాల్ ఫైల్స్, కేసరి చాఫ్టర్ 2, సూపర్ బాయ్ ఆఫ్ మెలిగోన్ వంటి చిత్రాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అయివే విషయం ఏంటంటే జాన్వీ కపూర్ నటించిన హోమ్ బౌండ్ చిత్రం విడుదలకు ముందే ఆస్కార్ అవార్డు నామినేషన్లో నిలవడం విశేషం. గతేడాది కేన్స్ చలన చిత్రోత్సవాల్లో హోమ్ బౌండ్ చిత్రాన్ని ప్రదర్శించగా.. వీక్షకుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది.