భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధంచేయాలని: అదనపు కలెక్టర్ నగేష్

a8c2ee9c-1f2b-4696-924c-782d75eeb91b

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు కార్యాచరణ పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. 2025-26 వానాకాలం ధాన్య కొనుగోలు జిల్లా లక్ష్యం 4. లక్షల 23 వేల మెట్రిక్ టన్నులు అని, జిల్లా వ్యాప్తంగా 503 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు నాణ్యాతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్ళకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో అదనపు కలెక్టర్ నగేష్ వానాకాలం ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ, తూనికలు, కొలతల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఖరీఫ్‌ 2025-26 సీజన్‌ కోసం రైస్‌ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈ ఖరీఫ్ లో సుమారు 4.23 లక్షల టన్నుల వరిధాన్యం కోనుగోలు కేంద్రాలకు రావటం జరుగుతుందన్నారు. ఈ ధాన్యం జిల్లాలోని 503 ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయబడుతందన్నారు. ధాన్యాన్ని సమయానికి దిగుమతి చేయాలని, ధాన్యం దిగుమతికి అవసరమైన 10% బ్యాంక్‌ గ్యారంటీని, అగ్రిమెంట్లును వెంటనే సమర్పించాలని సూచించారు. అలాగే, మిల్లుల్లో బ్లెండింగ్‌, సార్టెక్స్‌ యంత్రాలను ఏర్పాటు చేయడం, ధాన్యం దిగుమతులు సజావుగా సాగేందుకు తగినంత హమాలీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని తెలిపారు. ఖరిఫ్స్ 2024-25, రబీ 2024-25 సీఎంఆర్ ను యఫ్‌సీఐ (FCI)కు ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు డెలివరీ చేయాలనీ సూచించారు. ఖరీఫ్‌ 2025-26 సీజన్‌ సాఫీగా సాగేందుకు మిల్లర్లు పూర్తి సహకారం అందించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారికి, వ్యవసాయ అధికారులకు, సహాయ వ్యవసాయ అధికారులకు, హర్వేస్టర్ యజమానులకు పలు సూచనలు చేశారు. RPM 18-20 లోపు ఉండాలని అలాగే బ్లోవేర్ ఎప్పటికీ ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో పీ.నిత్యానందం, జిల్లా సివిల్‌ సప్లై అధికారి, జగదీష్, జిల్లా మేనేజర్‌ సివిల్‌ సప్లై కార్పొరేషన్‌, జిల్లా వ్యవసాయ అధికారి, రవాణాశాఖా అధికారి టీ.చంద్రపాల్, మెదక్ బాయిల్డ్‌ మిల్లర్స్‌ అధ్యక్షుడు వీరేశం, తదితరులు పాల్గొన్నారు.