భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, సెప్టెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

విషాదం.. బతుకమ్మ ఆడుతూ మహిళ మృతి

5

భారత్ సమాచార్, మహబూబాబాద్: బతుకమ్మ ఆడుతూ మృతి చెందిన ఘటన కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో జరిగింది. మండలానికి భార్య మౌనిక(36) ఇద్దరు కూతుర్లు, కుమారునితో కలిసి ఆనందంతో తీరొక్క పూలతో  బతుకమ్మను పేర్చింది. సాయంకాలం సమయంలో స్థానిక దేవాలయంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ సంతోషంగా ఉంది.  కోలాటం ఆడుతున్న క్రమంలోనే మౌనిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.  అంతసేపు ఆనందంగా ఉన్న మహిళలు హఠాత్పరిణామంతో అయోమయానికి గురయ్యారు. వెంటనే తేరుకున్న స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీంతో పండగ పూట ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బతుకమ్మ వేడుకకు ఆనందంగా వచ్చి.. బతుకమ్మ ఆడుతునే ప్రాణం విడిచిన మౌనికను తలుచుకుంటూ మహిళలు, గ్రామస్తులు కన్నీటి పర్యంతం అయ్యారు. కన్నతల్లి కుప్పకూలి మరణించడంతో ఆ ముగ్గురు చిన్నారుల రోదనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

మౌనిక మృతిపట్ల సంతాపం ప్రకటించిన టియుడబ్ల్యూజే(ఐజేయు).

కొత్తగూడ మండల జనంసాక్షి విలేకరి, టియుడబ్ల్యూజే(ఐజేయు) మండల నాయకులు పరుశురాం సతీమణి మౌనిక ఆకస్మిక మరణం పట్ల టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లాప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి ప్రగాడసంతాపాన్ని తెలిపారు. ఆనందంగా బతుకమ్మ ఆడుకుంటూ మౌనిక మరణించడం హృదయాన్ని కలిచివేసిందని, పరుశురాం కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు.