భారత్ సమాచార్, మహబూబాబాద్: బతుకమ్మ ఆడుతూ మృతి చెందిన ఘటన కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో జరిగింది. మండలానికి భార్య మౌనిక(36) ఇద్దరు కూతుర్లు, కుమారునితో కలిసి ఆనందంతో తీరొక్క పూలతో  బతుకమ్మను పేర్చింది. సాయంకాలం సమయంలో స్థానిక దేవాలయంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ సంతోషంగా ఉంది.  కోలాటం ఆడుతున్న క్రమంలోనే మౌనిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.  అంతసేపు ఆనందంగా ఉన్న మహిళలు హఠాత్పరిణామంతో అయోమయానికి గురయ్యారు. వెంటనే తేరుకున్న స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.…