భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

సమస్యల పరిష్కారానికి నేరుగా పోలీసులను సంప్రదించండి: ఎస్పీ

06

భార‌త్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి: జిల్లా ప్రజలకు సమస్యలుంటే నేరుగా పోలీసు కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ, సంబంధిత ఎస్.హెచ్.ఓ.లకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని, సివిల్ తగాదాలకు దూరంగా ఉండాలని, చట్ట ప్రకారం పరిష్కరించాలని ఎస్.హెచ్.ఓ.లకు సూచించారు.

సమస్యలకు స్థానికంగా పరిష్కారం లభించనప్పుడు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా పోలీసు కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఎస్పీ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

డీసీఎం వాహనం బోల్తా