భార‌త్ స‌మాచార్.నెట్, సంగారెడ్డి: జిల్లా ప్రజలకు సమస్యలుంటే నేరుగా పోలీసు కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ, సంబంధిత ఎస్.హెచ్.ఓ.లకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని, సివిల్ తగాదాలకు దూరంగా ఉండాలని, చట్ట ప్రకారం పరిష్కరించాలని ఎస్.హెచ్.ఓ.లకు సూచించారు.

సమస్యలకు స్థానికంగా పరిష్కారం లభించనప్పుడు, మూడో…