భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

స్త్రీలు, పిల్లల ఆరోగ్యంపై నర్సాపూర్‌లో సమీక్ష

16

భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ మండల సమైక్య సమావేశం సుమలత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాల వసూళ్లు, అలాగే కొత్త వ్యాపారాల ఏర్పాటుపై ఏపీఎం సంగమేశ్వర్ వివరించారు. పోషణ అభియాన్‌లో భాగంగా, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సరస్వతి, లక్ష్మి, కవితలు స్త్రీల ఆరోగ్యం, పిల్లల పోషణ గురించి క్లుప్తంగా తెలిపారు.

ఈ సంద‌ర్భంగా రెడ్డిపల్లి పీహెచ్‌సీ హెల్త్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. స్త్రీల ఆరోగ్యంపై, రక్తహీనతపై చర్చించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల పోషణ, పరిసరాల పరిశుభ్రత గురించి గ్రామ సంఘాల అధ్యక్షులకు ఆమె సూచనలిచ్చారు. సమావేశం అనంతరం, గ్రామ సంఘాల అధ్యక్షులు కలిసి బతుకమ్మ సంబరాలకు హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సంగమేశ్వర్, సీసీలు నర్సింలు, ప్రవీణ, దేవి సింగ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు.. కమిషనర్ ఆదేశాలు